schedule Friday, June 19, 2026

ఆపదలో ఉన్నవారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

calendar_today June 19, 2026
person Prajagalam News
ఆపదలో ఉన్నవారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
  (తాండూర్) ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన తాండూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన 94 మంది లబ్ధిదారులకు దాదాపు రూ. 33,00,000/- (ముప్పై మూడు లక్షల) విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక నాయకులకు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందని అన్నారు. పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అన్నారు.