schedule Friday, June 19, 2026

ఇందిరమ్మ ఇoడ్ల పేరుతో ఇసుక అక్రమ రవాణా...!

calendar_today June 16, 2026
person Prajagalam News
ఇందిరమ్మ ఇoడ్ల పేరుతో ఇసుక అక్రమ రవాణా...!
 

• ఇసుక రవాణా పై కఠినంగా వ్యవరించాలి.... సిపిఎం

(  తాండూర్) ఇసుక అక్రమ రవాణా పై పోలీసులు వ్యవస్థ కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ తాండూర్ పట్టణంలో సిపిఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో తాండూర్ పట్టణంలో గత కొన్ని రోజుల నుంచి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని అన్నారు.ఇసుక రావాణ మూలంగా సీతారాంపేట్ మరియు ఇతర వార్డులలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని రాత్రి వేళల్లో ఇసుక రవాణాతో ప్రజలు రాత్రి నిద్ర పోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. ఇసుక రవాణా వల్ల ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వలన ఇప్పటికే తాండూర్ పట్టణంలో అనేకసార్లు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నారు. ఈరోజు జరిగిన సంఘటన చూస్తే అందుకు నిదర్శనంగా ఉందన్నారు.ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక తరలిస్తున్న పేరుతో పర్మిషన్ కొద్దీ ఎక్కువ ఇసుక తరలించడం కోసం ట్రాక్టర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్డ్రై తో డ్రైవ్ చేయడం వల్ల తరచూ ప్రమాద సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు.ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాల్సిన అధికారులు రాజకీయాలకు తల్లోగడం వల్ల ఇసుక మాఫి యొక్క ఆవడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు యు. బుగ్గప్ప, ఉప్పలి. మల్కయ్య,ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రప్ప, కేఎన్ పిఎన్య నాయకులు రత్నం, సినీయర్ నాయకులు వై. రాములు,అశన్న తదితరులు పాల్గొన్నారు.