schedule Monday, October 26, 2026

నాపరాతి గనుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా, ప్రభుత్వ ఆదాయానికి గండి, పట్టించుకోని అధికారులు, అధికారుల తీరుపై మండిపడుతున్న స్థానికులు

calendar_today October 26, 2026
person Prajagalam News
నాపరాతి గనుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా, ప్రభుత్వ ఆదాయానికి గండి, పట్టించుకోని అధికారులు, అధికారుల తీరుపై మండిపడుతున్న స్థానికులు
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం పరిధిలో ఏక్మైయి,జీవంన్గీ, క్యాధిరా,కోర్వి చెడ్, నావల్గ గ్రామాలలో ఉన్న నాపరాతి గనులను ఎలాంటి ప్రభుత్వం అనుమతులు లేకుండా యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్లో అక్రమ నాపరాతి తొవ్వి సొమ్ము చేసుకుంటూ మైనింగ్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.మైనింగ్ మాఫియా యథేచ్ఛగా సాగిస్తున్న ఈ దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు మేర నష్టం వాటిల్లుతోంది. అధికారుల ముసుగులో కొందరు వసూళ్లకు పాల్పడుతుండటంతో ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​ప్రభుత్వ ఆదాయానికి ‘కోట్ల’ గండి ప్రధాన కారణాలు ​లీజులు లేవు, పన్నులు లేవు, ప్రభుత్వ భూముల్లో నాపరాతి తవ్వకాలు జరపాలంటే మైనింగ్ శాఖ నుంచి అనుమతులు (లీజులు) పొందాలి. కానీ,ఎటువంటి చట్టబద్ధమైన లీజు అనుమతులు లేకుండానే అక్రమంగా తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వానికి రావలసిన మైనింగ్ లీజు రుసుములను పూర్తిగా ఎగవేస్తున్నారు. ​రాయల్టీకి గండి: గనుల నుంచి తవ్విన ఖనిజాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే సమయంలో ప్రతి లారీకి/ట్రిప్పుకు ప్రభుత్వానికి ‘రాయల్టీ’ చెల్లించాలి.కానీ, ఎటువంటి పర్మిట్లు, చలానాలు లేకుండా రోజుకు వందలాది లారీలలో నాపరాళ్లను అక్రమంగా రవాణా చేస్తూ,కోట్ల రూపాయల రాయల్టీ ఆదాయాన్ని ఎగ్గొడుతున్నారు. ​అధికారుల ముసుగులో అక్రమ వసూళ్లు: మైనింగ్ ప్రాంతాల్లో తనిఖీలు చేసి అక్రమాలను అరికట్టాల్సిన కొందరు అధికారులు,వారి పేరిట నడుస్తున్న మధ్యవర్తుల ముసుగులో భారీగా మామూళ్లు (వసూళ్లు) స్వీకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయం అధికారుల, అక్రమార్కుల జేబుల్లోకి చేరుతోంది. ​ప్రభుత్వ భూముల కబ్జా: సర్కారు భూములను యథేచ్ఛగా హిటాచి 200 భారీ యంత్రాలతో తవ్వుతూ సహజ వనరులను దోచుకుంటున్నారు. అనుమతులు లేకపోవడంతో ఎంత పరిమాణంలో ఖనిజాన్ని తరలిస్తున్నారో లెక్కపత్రం లేకుండా పోయింది. ​ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించాలి! ​రూ. కోట్ల విలువైన సహజ వనరులు పక్కదోవ పడుతున్నా సంబంధిత మైనింగ్, రెవెన్యూ,పోలీస్ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మరియు మైనింగ్ శాఖ తక్షణమే స్పందించి: ​ఏక్మై, నావల్గా, జీవన్గి, క్యాద్గిరా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. ​అక్రమ మైనింగ్‌కు ఉపయోగిస్తున్న హిటాచి 200 యంత్రాలు, లారీలను సీజ్ చేయాలి. ​అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్న బాధ్యులపై మరియు వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ​ఖజానాకు పడుతున్న గండిని అరికట్టి,ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని మండల స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అక్రమ నాపారాతి గనులకు చెక్,పెడతారా లేదా అనేది వేచి చూడాలి?