అభివృద్ధి ఓర్వలేక మాపై వీర్షతో గ్రూపు రాజకీయాలు,అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం.
October 24, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కేంద్రంలో శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజ వర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అసంతృప్తి ఎందుకు,ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బషీరాబాద్ మండల అభివృద్ధికి 400 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారని అన్నారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల సమావేశానికి ప్రతి నాయకులకు సమాచారం ఇచ్చానని,పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి పని చేశానని,మీలాగా నేను ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేతో కండువాను కప్పుకునే రకం కాదని,ప్రజల మధ్యన ఉండే నాయకులం,ప్రజలకు సేవకులం అన్నారు. అదేవిధంగా మరి కొందరు నాయకులు మాట్లాడుతూ శంకర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి వాస్తే ఆత్మ కమిటీ చైర్మన్ ఇస్తే మేము నోరు మెలుపలేదు, అది మా సంస్కారం, మహిళాకు పిఎసిఎస్ చైర్మన్ పదవి,ఒక దళిత నాయకునికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి ఇస్తే ప్రమాణస్వీకారానికి రాలేదు.ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అభివృద్ధి ఓర్వలేక గ్రూపులు కట్టి రాజకీయాలు చేయడం సరికాదన్నారు.అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉందాం,కలిసి మెలిసి అభివృద్ధి చేసుకుందాం అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకరప్ప, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మన్ రావు,మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,వివిధ గ్రామాల సర్పంచులు,మాజీ ఎంపిటిసిలు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.