రేపు వికారాబాద్లో ‘ఓటు బచావో – దేశ్ బచావో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
calendar_today
October 26, 2026
person
Prajagalam News
రేపు వికారాబాద్లో ‘ఓటు బచావో – దేశ్ బచావో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్
వికారాబాద్ జిల్లా-:
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సత్య భారతి ఫంక్షన్ హాల్లో రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలకు ‘ఓటు బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కార్యవర్గ సమావేశం ఉంటుందని డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారసింగ్ నాయక్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ పరిశీలకులు రంగరాజన్ మోహన్ కుమారమంగళం, టీపీసీసీ కోఆర్డినేటర్ అఫ్సర్ యూసుఫ్ జాహీ హాజరుకానున్నారు. వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు టి. రామ్మోహన్ రెడ్డి, బుయ్యని మనోహర్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.ఈ సమావేశంలో ఓటు హక్కు పరిరక్షణ, ‘ఓటు బచావో – దేశ్ బచావో’ కార్యక్రమం అమలు, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా డీసీసీ కార్యవర్గ సభ్యులు, మండల, టౌన్ అధ్యక్షులు, వివిధ సంస్థల చైర్మన్లు, ఎస్ఐఆర్ కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, డైరెక్టర్లు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, సేవాదళ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సెల్ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఛార్జీలు, బూత్ లెవల్ ఏజెంట్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ కోరారు.