గూడూరులో వైభవంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం
October 24, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని గూడూరు గ్రామంలో శ్రీ వీరభద్ర సమేత భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.ఆలయ ప్రధాన అర్చకులు శివశ్రీ శివానంద గురుస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా జరిపించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ నాయకులు డాక్టర్ వెన్నె ఈశ్వరప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — "పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఎంతో కమనీయంగా, కన్నుల పండువగా సాగింది. ఈ దివ్య కళ్యాణోత్సవంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా, అదృష్టంగా భావిస్తున్నాను" అని పేర్కొన్నారు. భక్తులందరికీ స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ యాదవరెడ్డి, నార్మక్ మదర్ డైరీ డైరెక్టర్ నరసింహారెడ్డి, స్థానిక సర్పంచ్ ఉషారాణి మధు, ఉప సర్పంచ్ బంటు బాల్ రాజ్,దేవాలయ కమిటీ దేవాలయ అధ్యక్షుడు అగిరాల వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి జి. కిష్టారెడ్డి, ఉప కార్యదర్శి ఎ. నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల ప్రతినిధులు, మహిళలు మరియు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.