schedule Tuesday, October 27, 2026

రోడ్డుపై కారు అడ్డుగా పెట్టావంటే బూతులు తిడుతూ దాడి.. పంచాయతీ కార్యదర్శిపై పోలీసులకు ఫిర్యాదు!

calendar_today October 27, 2026
person Prajagalam News
రోడ్డుపై కారు అడ్డుగా పెట్టావంటే బూతులు తిడుతూ దాడి.. పంచాయతీ కార్యదర్శిపై పోలీసులకు ఫిర్యాదు!
వికారాబాద్ జిల్లా దోమ మండలంలో పంచాయతీ కార్యదర్శి దౌర్జన్యానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఓ వ్యక్తిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతూ, దాడికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుడు తెలిపిన కథనం ప్రకారం... బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన అరవింద్ అనే వ్యక్తి పరిగి నుండి మోత్కూరు వైపు వెళ్తున్న సమయంలో, మోత్కూరు మార్గంలో పంచాయతీ కార్యదర్శి (అయినాపూర్ గ్రామ సర్పంచ్ భర్త) తన కారును రోడ్డుకు అడ్డుగా నిలిపి ఉంచాడనీ, వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందంటూ అరవింద్ ఆయనను ప్రశ్నించగా, సదరు పంచాయతీ కార్యదర్శి తీవ్ర ఆగ్రహానికి గురవుతూ "నా ఇష్టం.. పోయి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టుకో!" అంటూ భయభ్రాంతులకు గురిచేసేలా బెదిరింపులకు దిగాడని,అంతటితో ఆగకుండా అసభ్య పదజాలంతో బూతు పురాణం అందుకుంటూ దాడికి యత్నించినట్లు పేర్కొన్నారు. బాధితుడు అరవింద్ ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు,పోలీసులు తగు విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరారు.