schedule Monday, October 26, 2026

ఫ్లై ఓవర్ రోడ్డు పనులో వేగం పెంచండి

calendar_today October 24, 2026
person Prajagalam News
ఫ్లై ఓవర్ రోడ్డు పనులో వేగం పెంచండి

ఫ్లై ఓవర్ రోడ్డు పనులో వేగం పెంచండి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

 
  • వికారాబాద్ -:ఫ్లైఓవర్ రోడ్డు పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.... ఫ్లైఓవర్ రోడ్డు పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన అధికారులకు సూచించారు.ఫ్లైఓవర్ రోడ్డు పనులు పూర్తయితే ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి పనులను త్వరగా పూర్తి చేయాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు.ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు సహకరించి ఆస్తులు కోల్పోయిన వారికి వారం రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించేందుకు తగు చర్యలు తీసుకున్నట్లు శాసనసభ సభాపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు.శాసనసభ సభాపతి పర్యటనలో ఆర్డీఓ వాసు చంద్ర, డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.