బ్రిక్స్ సమావేశాలకు బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
October 26, 2026
Prajagalam News
బ్రిక్స్ సమావేశాలకు బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
- వికారాబాద్ జిల్లా-: అంతర్జాతీయ వేదికపై తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యతను చాటి చెప్తామని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాలకు తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బయలు దేరారు.తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, బ్రిక్స్ సమావేశాల వేదికగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రగతికి సంబంధించిన కీలక అంశాలను వివరించడంతో పాటు, రాష్ట్ర ప్రయోజనాలను బలంగా వినిపిస్తామని తెలిపారు.అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యతను చాటిచెప్పేందుకు, రాష్ట్ర ఖ్యాతిని మరింత పెంచేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.