మైనింగ్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్
వికారాబాద్ జిల్లా-:వికారాబాద్ జిల్లా బంట్వారం మండల పరిధిలోని బొపునారం గ్రామం లో శుక్రవారం నాడు తీవ్ర విషాదకర సంఘటన నెలకొంది. మణికంఠ మైనింగ్ క్వారీలు ఉన్న ప్రాంతంలో ఎలాంటి హెచ్చరిక బోర్డు లు భద్రత సిబ్బంది లేకపోవడం వల్లే చిన్నారులు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారని స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు మైనింగ్ యాజమాన్యం, ప్రభుత్వం దిగి వచ్చే వరుకు మృత దేహాలను ఇక్కడి నుండి కదిలేనిచ్చే ప్రసక్తే లేదని రాత్రంతా మణికంఠ మైనింగ్ లో ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం కుంచారం గ్రామానికి చెందిన విద్యార్థులు సురేందర్,అజయ్ 8,9 చదువుతున్నారు. తండ్రి లేని పిల్లలు కు మణికంఠ మైనింగ్ యాజమాన్యం, ప్రభుత్వం దిగి వచ్చి పరిహారం చెలించేదాకా ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని నిరసనకు దిగారు. ఈ మైనింగ్ తో పాటు జిల్లాలోని పలు మైనింగ్ లల్లో ఎలాంటి భద్రత లేదని,మైనింగ్ క్వారీలో పడి ఇప్పటికే పలువురు మృతి చెందిన సంఘటనలు చాలానే ఉన్నాయి.ఇప్పటికైనా మైనింగ్ అధికారులు మైనింగ్ క్వారీలను పరిశీలించి తగిన భద్రత తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.