schedule Friday, June 05, 2026

నియోజకవర్గ ‘సర్’ కన్వీనర్‌గా కరణం పురుషోత్తం రావు

calendar_today June 2, 2026
person Prajagalam News
నియోజకవర్గ ‘సర్’ కన్వీనర్‌గా కరణం పురుషోత్తం రావు
      తాండూరు : నియోజకవర్గ ‘సర్’ కన్వీనర్‌గా సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు నియమితులయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తాండూర్ నియోజకవర్గ ‘సర్’ కన్వీనర్‌గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పురుషోత్తం రావును నియమిస్తున్నట్లు తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ముందస్తు ప్రక్రియ ‘వోటర్ మ్యాపింగ్’ అత్యంత కీలకమైనదని తెలిపారు.ఈ ముమ్మ ప్రక్రియను పార్టీ పరంగా విజయవంతం చేసేందుకు తాండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పరిధిలో గల 269 పోలింగ్ బూత్‌లకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించామని కొత్తగా నియమితులైన నియోజకవర్గ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు క్షేత్రస్థాయిలో ఉన్న బిఎల్ఏ లకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సార్ ప్రక్రియ ఎలాంటి లోపాలు లేకుండా, పకడ్బందీగా జరిగేలా పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. కరణం పురుషోత్తం రావు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తారని అన్నారు సార్ పేరుతో కేంద్రం ఓట్లను తొలగించే యత్నం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసి బెంగాల్లో 90 లక్షల ఓట్లు తొలగించారని అదేవిధంగా బీహార్ లో 50 లక్షల ఓట్లను తొలగించారని అన్నారు. అర్హులైన ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా అధికారులు నాయకులు కృషి చేయాలని అన్నారు. అధికారులకు స్పందించకుంటే కన్వీనర్ కు సమాచారం అందించాలన్నారు. అనంతరం కరణం పురుషోత్తం రావు మాట్లాడుతూ సర్ ప్రక్రియను అందరూ సహకరించి విజయవంతం చేయాలని అన్నారు. గ్రామాలలో పట్టణాలలో రెండు చోట్ల ఓట్లు లేకుండా ఒకే చోట ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. ఫామ్ సిక్స్ సెవెన్ మరియు సవరణలను పకడ్బందీగా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.