schedule Friday, July 31, 2026

కుల్కచర్లలో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ,మోటివేషనల్ క్యాంపు:- జిల్లా గిరిజన శాఖ అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి

calendar_today June 3, 2026
person Prajagalam News
కుల్కచర్లలో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ,మోటివేషనల్ క్యాంపు:-   జిల్లా గిరిజన శాఖ అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి
(ప్రజాగళం, కుల్కచర్ల)
యువత ఉద్యోగ,ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో అవసరమని వికారాబాద్ జిల్లా గిరిజన శాఖ అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యలయంలో గురువారం ఉదయం 10.30నిమిషాలకు
ఇంటిగ్రాటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్లేన్ ఏరియా క్రింద గిరిజన నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ప్రోగ్రాం,మోటివేషనల్ క్యాంప్ ఆరు నైపుణ్య శిక్షణ ఏజెన్సీల ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని గిరిజన యువత అందరు హాజరు కాగలరు మరియు ఇట్టి కార్యక్రమానికి దిగ్విజయం చేయాలని కోరారు.