పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి:- కుస్మసముద్రం సర్పంచ్ గందె ప్రవీణ్ కుమార్
June 5, 2026
Prajagalam News
(ప్రజాగళం, కుల్కచర్ల)
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కుస్మసముద్రం సర్పంచ్ గందె ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల పరిధిలోని కుస్మసముద్రం గ్రామ పంచాయతీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామం పచ్చదనంతో ఉంచేందుకు మొక్కలు నాటాలని,చెట్లను నరక వద్దు అని గ్రామ ప్రజలకు సందేశాన్ని ఇస్తూ గ్రామంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ నూతన పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ పద్మ కృష్ణయ్య,వార్డు సభ్యులు గజ్జి కవిత,గజ్జి సురేష్,మోత్కూరు శ్రీనివాస్,గొల్ల మల్లమ్మ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు దొంగల చెన్నయ్య,ఫీల్డ్ అసిస్టెంట్ గజ్జి భీమయ్య, మహిళా సంఘాల సభ్యులు డ్యాగ అనురాధ, కల్పన, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు