schedule Tuesday, July 28, 2026

బసవేశ్వర దుకాణ సముదాయంలో కాషాయ జెండా ఆవిష్కరణ

calendar_today July 28, 2026
person Prajagalam News
బసవేశ్వర దుకాణ సముదాయంలో కాషాయ జెండా ఆవిష్కరణ
(తాండూర్ ) తాండూర్ పట్టణంలోని బసవేశ్వర దుకాణ సముదాయంలో మంగళవారం కాషాయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు, యువకులు పాల్గొని జెండాకు వందనం చేశారు. అనంతరం జాతీయ, సాంస్కృతిక విలువలను కాపాడేందుకు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ సభ్యులు కౌన్సిలర్ నాగారం మల్లేశం, మహేష్ సింగ్ ఠాగూర్,మోహన్ సెట్, అడికి శశాంక్, ప్రశాంత్,రామ్ సాగర్, ఉరడి నారాయణ, ప్రకాష్, అవినాష్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.