ప్రభుత్వ భూమి కబ్జా,పట్టించుకోని అధికారులు
October 28, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం పరిధిలో మైల్వార్ గ్రామంలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 235లో అక్రమంగా పంచర్ షాప్ ను నిర్మించడం జరిగిందని, మంగళవారం నా డు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ కుర్వ తమన్న,వార్డు సభ్యులు బలరాం,నరేష్,ప్రవీణ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అబ్దుల్,అబ్దుల్ ఖలీల్ సత్తార్,ఇబ్రహీం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దానం లక్ష్మప్ప ప్రభుత్వ భూమిని,అక్రమ నిర్మాణానికి వత్తాసు పలుకుతూ కొందరి నాయకులతో కుమ్మకై మొహమ్మద్ అబ్దుల్ గౌస్ ఇంటి నెంబర్ 2-61/5 లో వెల్డింగ్ షాపు 2024 మే నెలలో ఉన్నట్లు షాప్ కోసం విద్యుత్ మీటర్ క్యాటగిరి 2లో అనుమతి తీసుకొని విద్యుత్ మీటర్‌ను అమర్చుకున్నారు. అనుమతి తీసుకున్న స్థానంలో విద్యుత్ మీటర్ అమర్చకుండా మైల్వార్ బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ స్థలములో వెల్డింగ్ షాప్ లో అమర్చారు.ఈ షాపుకు ఎలాంటి ప్రభుత్వం అనుమతులు లేవు, కానీ నీటి వసతి కల్పించాలని గ్రామపంచాయతీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ అధికారి పంచాయతీ కార్యదర్శి అనుమతులు ఒకచోట మరొకచోట నీటి వసతి కలెక్షన్ ఏ విధంగా ఇవ్వాలని తిరస్కరించడం జరిగింది.విద్యుత్తు మీటర్,నల్ల కలెక్షన్, గ్రామపంచాయతీ అనుమతి,పన్ను రసీదులను జతపరిచి ప్రభుత్వ స్థలాన్ని కాజేయాలని ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని అన్నారు.గతంలో ఇలాగే ఇంటి నిర్మాణం చేపట్టారని ప్రభుత్వ అధికారుల నుండి నోటీసులు జారీ చేసిన లెక్కచేయకుండా ఇంటి నిర్మాణం చేస్తున్నారని, అధికారులు వెంటనే స్పందించి,ప్రభుత్వ భూమిని,ఆస్తులను కాపాడాలని,గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వ స్థలాన్ని ఉపయోగించాలని కోరడం జరిగింది.