• పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి
(తాండూర్)
పట్టణంలో కోకట్ రోడ్డు మార్గంలో వెలిసిన శ్రీ సాయిబాబా మూలవిరాట్ విగ్రహ ఊరేగింపు పల్లకి సేవ భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ళ నీరజ బాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవ ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన భక్తి భావంతోనే మనశ్శాంతి లభిస్తుందని సాయిబాబా కృప తాండూర్ ప్రజలందరికీ పై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయం నుండి పట్టణం పుర వీధుల గుండా సాయిబాబ వారి పల్లకి సేవ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ ఊరేగింపులో శంకర్ యాదవ్ , బీసీ సంఘం జాతీయ కన్వీనర్ రాజ్ కుమార్,నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో బాబా భక్తులు, పట్టణ ప్రజలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.