schedule Tuesday, July 28, 2026

మత సామరస్యానికి ప్రతీక ముర్షద్ దర్గా ఉత్సవాలు

calendar_today July 26, 2026
person Prajagalam News
మత సామరస్యానికి  ప్రతీక ముర్షద్ దర్గా ఉత్సవాలు

• ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

(తాండూర్) తాండూరు పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన ముర్షద్ దర్గా ఉత్సవాలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. దర్గాలోని పవిత్ర సమాధిపై పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన 'జల్సా-ఎ-సీరత్-ఎ-ఔలియా' కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మత సామరస్యం, సోదరభావానికి ప్రతీక ముర్షద్ దర్గా ఉత్సవాలని అన్నారు. ఇక్కడికి కుల మతాలకతీతంగా పెద్ద ఎత్తున ఉత్సవాలకు ప్రజలు తరలి వస్తారని అల్లా దయతో సర్వం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజ్, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.