schedule Tuesday, July 28, 2026

నేటి నుంచి ముర్షద్ దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం

calendar_today July 26, 2026
person Prajagalam News
నేటి నుంచి ముర్షద్ దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం
    (తాండూరు) తాండూరు పట్టణంలోని ముర్షద్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముస్తాబయ్యింది. ఆదివారం నుంచి 80వ ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తుట్లు నిర్వహకులు ముతవల్లి అల్హజ్ సయ్యద్ అబ్దుల్ గనిపాష శని  తెలిపారు. దర్గాలో హజ్రత్ సయ్యద్ అబ్దుల్ కరీం పాష సాహెబ్ ఖిబ్లా చిష్తి ఖలందరి మిర్జాయి రహమతుల్లా అలై గారి 80వ ఉర్సే షరీఫ్ పాటు హజ్రత్ సయ్యద్ అబ్దుల్ సలాం పాష సాహెబ్ చిష్తి ఖలందరి మిర్జాయి గారి 20 ఉర్సే షరీఫ్ ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. సోమవారం రాత్రి 7 గంటలకు గంధము వారి ఇంటి నుంచి బయల్దేరి 8గంటలకు దర్గా షరీఫ్కు చేరుకుని సందల్ మాలి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా మంగళవారం దీపోత్సవం, రాత్రి 9-30గంటలకు ఖవ్వాలి, బుధవారం నమాజ్ బాద్ ఫజర్ తిలావత్ ఖురస్పాక్, ఉదయం 8గంటలకు ఫాతేహఖ్వాని, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. మరోవైపు ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకుని నెప్రాలజీ, ట్రాన్స్ ప్లాంట్ సర్వీసెస్ డైరెక్టర్ డా. మహమ్మద్ సోహెచ్ ఖాన్ హాజరువుతన్నారని తెలిపారు. కావున ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని ఉర్సుఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.