ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఓ,బిఎల్ఏ లతో సమావేశం 91శాతం పూర్తి
July 28, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ గ్రామ పంచాయతీలో ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఓ,బిఎల్ఏ లతో సమావేశం నిర్వహించిన తహశీల్దార్ షాహేద్ బేగం,ఎంపిడిఓ సంపత్ కుమార్ సోమవారం నాడు నిర్వహించారు.ఈ సందర్భంలో అధికారులు మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ 91 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు.ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో డబుల్ పేర్లు,మరణించిన వారిని తొలగించాలి అన్నారు.ఈ కార్యక్రమంలోబషీరాబాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ,ఆర్.ఐ నాగార్జున రెడ్డి, బిఎల్ఓ,బిఎల్ఎ,,వివిధ పార్టీనాయకులు,తదితరులు ఉన్నారు.