schedule Tuesday, July 28, 2026

చిలుకవాగు అభివృద్ధికి మరో రూ.30 కోట్లు

calendar_today July 27, 2026
person Prajagalam News
చిలుకవాగు అభివృద్ధికి మరో రూ.30 కోట్లు
 

ఆర్థిక అనుమతులు  జీవో జారీ

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషికి మరో విజయం

(తాండూర్) చిలుక వాగు అభివృద్ధికి అదనంగా మరో 30 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఈ మేరకు ఆర్థిక అనుమతులు జారీ అయినట్లు తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిలుకవాగు ప్రాజెక్టుకు అదనపు నిధుల మంజూరు కోసం తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గత వారం రోజుల క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి  భట్టి విక్రమార్కని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తయ్యేందుకు అదనపు నిధులు మంజూరు చేయడంతో పాటు, త్వరితగతిన ఆర్థిక అనుమతులు జారీ చేసి సంబంధిత జీవో విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే బీయంఆర్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం తాజాగా రూ.30 కోట్ల అదనపు నిధులకు ఆర్థిక అనుమతులు జారీ చేస్తూ అధికారిక జీవోను విడుదల చేసింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి  మాట్లాడుతూ.. చిలుకవాగు ప్రాజెక్టుకు అదనంగా రూ.30 కోట్ల నిధులు మంజూరు కావడం తాండూర్ ప్రజలకు ఎంతో శుభవార్త అని అన్నారు.ఈ నిధులతో ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం అవుతాయని తెలిపారు.తాండూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కి, ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు కి తాండూర్ ప్రజల తరఫున ఎమ్మెల్యే బీయంఆర్  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.