schedule Wednesday, July 29, 2026

దత్తాత్రేయ స్వామి కరుణా కటాక్షాలతో సర్వం సుభిక్షంగా ఉండాలి.

calendar_today July 29, 2026
person Prajagalam News
దత్తాత్రేయ స్వామి కరుణా కటాక్షాలతో సర్వం సుభిక్షంగా ఉండాలి.
 

అన్ని దానాల కన్నా అన్నసమర్పణ గొప్పది.

• మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్.

(తాండూరు) దత్తాత్రేయుని కరుణా కటాక్షాలతో సర్వంసుభిక్షంగా ఉండాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ పేర్కొన్నారు.బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా ఘాన్గాపూర్ లోని త్రివేణి సంగమంలో నది స్నానం ఆచరించి శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు వేదమంత్రో చ్ఛారణలతో ఆశీర్వదించి మరెన్నో ఉత్తమ పదవులు చేపట్టాలని మనసారా ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేస్తూ ఘనంగా సన్మానించారు.గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు వర్య్త విఠల్ నాయక్ అన్నసమర్పణ నిర్వహించారు .ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ పౌర్ణమిరోజు చేసిన పూజలు, దానధర్మాలు, జన్మజన్మల పాపాలు తొలగిపోతాయన్నారు. అన్నసమర్పణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అన్ని దానాలకన్నా అన్నసమర్పణ గొప్పదన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు.ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చు కోవాలని సూచించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం జరుగుతుందని వెల్లడించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ పూజారులు రాజు , భక్తులు, తదితరులు ఉన్నారు.