• గురు పౌర్ణమి సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తులు
• సాయినాథుని సన్నిధిలో భక్తుల వెల్లువ
• ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి
తాండూర్:
కోకట్ రోడ్డు మార్గంలో వెలసిన శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, వైభవోపేత పుష్పార్చన మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి పాల్గొని సాయిబాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా సాయిబాబా వారికి వివిధ రకాల సుగంధ పుష్పాలతో భక్తిశ్రద్ధలతో పుష్పార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ వేద పండితులు చైర్‌పర్సన్‌కు ఆశీర్వచనం అందించి, స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను సమర్పించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి మాట్లాడుతూ, "సాయినాథుని దివ్య ఆశీస్సులు తాండూర్ పట్టణ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించాను" అని తెలిపారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబా వారి ఆశీస్సులు పొందారు.
: