ముర్షద్ దర్గా ఉత్సవాలలో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి
calendar_today
July 29, 2026
person
Prajagalam News
• మతాలు వేరైనా మనమందరం ఒక్కటే
• సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడాలి
(తాండూరు)
ముర్షద్ దర్గా వార్షిక ఉత్సవాలలో ఆర్ బి ఓ ఎల్ సి ఈ ఓ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, "మతాలు వేరైనా మనమందరం ఒక్కటేనని సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడాలి. అన్ని మతాలను పరస్పరం గౌరవించుకుంటూ సామరస్యంతో జీవించడం ప్రతి ఒక్కరి బాధ్యత" అని అన్నారు.ముర్షద్ దర్గా ఉత్సవాలకు తాండూరు ప్రాంతంతో పాటు పొరుగు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఈ ఉత్సవాల ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో దర్గా ఉత్సవ ప్రతినిధులు మాజీ ఏఎంసీ చైర్మన్ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.