విద్యతో పాటు ఆరోగ్యంపై విద్యార్థులు దృష్టి సారించాలి:
calendar_today
July 29, 2026
person
Prajagalam News
• మున్సిపల్ చైర్మన్ నీరజ బాల్ రెడ్డి
( తాండూర్)
తాండూర్ పట్టణంలోని ఖాంజాపూర్ సమీపంలో ఉన్న తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్‌లో యోగా తరగతులను బుధవారం మున్సిపల్ చైర్మన్ నీరజ బాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే యోగా అలవాటు చేసుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా కాపాడుకోవాలని సూచించారు.ప్రతిరోజూ యోగా, క్రీడలు, వ్యాయామం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కృషి ఫలితంగా గురుకుల పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో యోగా గురువు ప్రవీణ్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.