( తాండూర్)
దశలవారీగా అన్ని వార్డుల సమూల అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి అన్నారు.మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి చేతుల మీదుగా 24వ వార్డులో నూతన బోర్‌వెల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా మౌలిక సదుపాయాల కల్పనకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని తెలిపారు. వార్డు అభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని దశలవారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,ఇతర వార్డు కౌన్సిలర్లు, వార్డు నాయకులు, కాలనీవాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.