schedule Friday, June 05, 2026

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యం:- ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

calendar_today June 4, 2026
person Prajagalam News
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యం:- ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు
(ప్రజాగళం, కుల్కచర్ల) ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మార్చి 6వ తేదీ నుండి అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా అమలు చేయబడుతోందని ముజాహిద్ పూర్ సర్పంచ్ చంద్రభూపాల్,కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి,ఎంఈఓ హబీబ్ అహ్మద్,ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ సభ సందర్భంగా వారు మాట్లడుతూ గ్రామ సభలు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను చేరవేసే సమర్థవంతమైన వేదికలని అన్నారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.