ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
calendar_today
June 2, 2026
person
Prajagalam News
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు
తాండూరు:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రోహిత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల అమరుల త్యాగాలు కెసిఆర్ కృషితో తెలంగాణ సిద్ధించిందని అన్నారు.అన్ని గొంతుకులను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించిన జాతిపిత కెసిఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ లను పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ కు చేతకావడం లేదని అన్నారు. పదేండ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. పింఛన్లు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్, రైతు భీమా రైతు భరోసా తదితర పథకాలను దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రవేశ పెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు. అబద్ధపు పునాదులపై గద్దినెక్కిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. తాండూర్ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే నేడు ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. రోహిత్ రెడ్డిని అనుగదొక్కెందుకే అక్రమ కేసులు బనాయించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. ప్రాంతానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమి లేదని మీరు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, నాయకులు సాయిపూర్ నర్సింలు, శ్రీనివాస్ చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, నాయకులు వెంకట్ రెడ్డి, మంకాల రాఘవేందర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, మధు గౌడ్, చందర్, ఇర్ఫాన్, బషరత్, చెన్ బసప్ప, రవీందర్, కౌన్సిలర్లు నవీన సంతోష్ గౌడ్, సుప్రీత కరుణాకర్, నాగలక్ష్మి, జావేద్, యోగానంద్, ఇర్షాద్, సురేష్ నాయక్, నాయకులు అబ్దుల్ సలీం, సంతోష్ గౌడ్, గుండప్ప కరుణాకర్, రుద్రు పాటిల్, భీమ్ సింగ్, అనంత రెడ్డి, చెన్నారెడ్డి, కోట్రీక శ్రీకాంత్, అంజాద్ ఖాన్, ఫైసల్ ఖాన్, అస్ఫక్, బీఆర్ఎస్వీ నాయకులు ఇబ్రహీం, వినోద్, సోహెబ్, తదితరులు పాల్గొన్నారు.