ఆరు గ్యారెంటీలకు అసెంబ్లీలో నిధులు గుండు సున్నా.
March 22, 2026
Prajagalam News
పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
Vikarabad
ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం , నేడు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి,ప్రజలను మోసం చేసిందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం పరిగి పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన రెండున్నర సంవత్సరాల్లో ఆరు గ్యారెంటీలకు నిధులు కేటాయించకపోవడం సిగ్గు చేటని అన్నారు.
రాష్ట్రంలో మోసపూరిత పరిపాలన నడుస్తుంది అని,కట్టిన ఇండ్లను కూల్చే పనిలో,ప్రజల జీవితాలను,రైతాంగాన్ని కూని చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు.
రాబోయే రెండేళ్లలో బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగ్గిన గుణపాఠం చెబుతారన్నారు.ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ కౌన్సిలర్లు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు