schedule Friday, July 31, 2026

గుర్తింపు లేని“ది మాస్టర్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్” పై చర్యలు తీసుకోవాలి.

calendar_today May 26, 2026
person Prajagalam News
గుర్తింపు లేని“ది మాస్టర్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్” పై చర్యలు తీసుకోవాలి.
 

ఎంఈఓ కు ఫిర్యాదు చేసిన పిడిఎస్యు అధ్యక్షుడు పి. శ్రీనివాస్ 

(తాండూర్) తాండూర్ పట్టణంలో “ది మాస్టర్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్” అనే ప్రైవేట్ విద్యాసంస్థ గుర్తింపు లేకుండా అడ్మిషన్లు ప్రారంభించి, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్లు స్థానిక ఎంఈఓ కి పీ డి ఎస్ యు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పిడిఎస్యు  జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంస్థ “CBSE Curriculum” పేరుతో పోస్టర్లు, బ్యానర్లు, సోషల్ మీడియా ప్రకటనలు విడుదల చేసి ఫ్రీ అడ్మిషన్ వంటి ఆఫర్లు ప్రకటిస్తూ అడ్మిషన్లు కూడా ప్రారంభించారు కానీ, ఈ స్కూల్‌కు విద్యాశాఖ నుండి గుర్తింపు లేదా అనుబంధం లభించలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం   చట్టవిరుద్ధం. గుర్తింపు లేకుండా స్కూల్ నడపడం విద్యార్థులు మరియు తల్లిదండ్రులను మోసం చేయడమే అవుతుందని అన్నారు. వెంటనే ఆ స్కూల్‌పై తనిఖీ చేయాలని గుర్తింపు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటే వాటిని నిలిపివేయాలని అన్నారు. స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు. ఉన్నత విద్యాధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల భవిష్యత్తు రక్షణ కోసం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పిడిఎస్యు  విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో త్వరలోనే గుర్తింపు లేని పాఠశాలలను , అధిక ఫీజులకు దోపిడికి పడుతున్న పాఠశాలల పైన చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.