schedule Friday, July 31, 2026

ఫించన్ల విషయంలో ప్రజల్ని మభ్యపెడుతున్ళ ప్రభుత్వం :- బిఆర్ఎస్ పార్టీ నాయకుడు,మాజీ ఎంపిటిసి మాలె కృష్ణయ్య గౌడ్

calendar_today May 25, 2026
person Prajagalam News
ఫించన్ల విషయంలో ప్రజల్ని మభ్యపెడుతున్ళ ప్రభుత్వం :- బిఆర్ఎస్ పార్టీ నాయకుడు,మాజీ ఎంపిటిసి మాలె కృష్ణయ్య గౌడ్
(ప్రజాగళం, కుల్కచర్ల) రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త ఫించన్ల దరఖాస్తు ప్రక్రియ సంబందించి గ్రామ, మండల స్థాయి అధికారులకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని చెబుతున్నారని కేవలం ప్రజల్ని మభ్యపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు,కుల్కచర్ల మాజీ ఎంపిటిసి మాలె కృష్ణయ్య గౌడ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. అర్హులైన ప్రజలు మండుటెండలో ఫించన్ల దరఖాస్తుల కోసం మీసేవ కేంద్రాలు, జిరాక్స్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.