schedule Friday, July 31, 2026

నీటి ఎద్దడి  నివారణకు చర్యలు తీసుకోండి

calendar_today May 26, 2026
person Prajagalam News
నీటి ఎద్దడి  నివారణకు చర్యలు తీసుకోండి
 

• జిల్లా కలెక్టర్ కు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ల వినతి

( తాండూర్) తాండూరు పట్టణంలో నెలకొన్న నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు.అదేవిధంగా ప్రతి వార్డుకు మూడు కొత్త బోర్లు మంజూరు చేయాలని కలెక్టర్ ని వినతిపత్రం ద్వారా కోరారు.ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, త్వరలోనే తగిన చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఇర్షాద్, అనిల్, యోగి మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ సంతోష్ గౌడ్, ఏజాజ్ లు పాల్గొన్నారు.