schedule Saturday, May 30, 2026

మొలుకులు వచ్చిన వడ్లు,కన్నీళ్ళతో సతమతమవుతున్న రైతులు,తడిసిన వడ్లను వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి*

calendar_today May 27, 2026
person Prajagalam News
మొలుకులు వచ్చిన వడ్లు,కన్నీళ్ళతో సతమతమవుతున్న రైతులు,తడిసిన వడ్లను వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి*
    వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో వివిధ గ్రామలలో అకాల వర్షాలకు రైతు పండించిన వరి ధాన్యం తడిసి మొలకలు రావడంతో రైతులు కన్నీళ్లతో సతమతమవుతున్నారు. ఆరు నెలలు కష్టపడి,నారు పోసి,నీరు పెట్టి,ఎరువులు వేసి ఎంతో కష్టపడి వడ్డీలకు అప్పులు తెచ్చి పండించిన పంటను రైతుల కళ్ళముందే అకాల వర్షాలకు ధాన్యం పాడైతే రైతులకు ఏమి చేయాలో తోచని స్థితిలో రైతులు ఆగమవుతున్నారు.రైతులు పంటను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు.తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు.ప్రభుత్వం తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారా,లేదా అంశంపై రైతులు దిగులు చెందుతున్నారు.ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైతులకు మేలు చేసిన వారు అవుతారని రైతులన్నారు.