పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి . వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ

విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యేలా విద్యా బోధన ఉండాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.మంగళవారం పరిగి కుల్కచర్ల మండల పరిధిలోని జిల్లా పరిషత్ బాలు ఉన్నత పాఠశాల, అంగన్‌వాడి కేంద్రంతో పాటు సీసీ రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్ దీపక్ తివారీ పరిశీలించారు.ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు జరుగుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ గణితసభలో పేర్కొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ... 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారని, మీరంతా బాగా చదివి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. సబ్జెక్టు పరంగా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. అనంతరం అంగన్వాడి వైద్య బాలింతలు, గర్భిణీ స్త్రీలు వారికి పోషక ఆహారం, గుడ్ల పంపిణీ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించినప్పుడు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వంటకాల నాణ్యతను పరిశీలించి భోజనాన్ని విద్యార్థులకు అందజేయాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం మండల పరిధిలోని కళ్యాణ్ నగర్‌లో నూతనంగా వేయించిన సీసీ రోడ్డును కలెక్టర్ పరిశీలించారు.ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులైన సీసీ రోడ్లు, ప్రహారీ గోడల పనులను ఈ నెల 27న వివిధ పనులు పూర్తి చేశాయి,అదేవిధంగా పూర్తి అయిన అభివృద్ధి పనులకు పెయింటింగ్ పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాధికారి రేణుకా దేవి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్ కుమార్, తహశీల్దార్ మనోహర్ చక్రవర్తి,ఎంపీడీవో రామకృష్ణ,ఎంఈఓ హబీబ్ అహ్మద్,కుల్కచర్ల సర్పంచ్ వార్వాళ్ళ అంజిలయ్య, వ్యవసాయ కమిటీ చైర్మన్ బీఎస్ ఆంజనేయులుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.