schedule Saturday, May 30, 2026

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు  డిసిసి ఉపాధ్యక్షుడు బోలుసాని భీంరెడ్డి,ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

calendar_today May 11, 2026
person Prajagalam News
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు    డిసిసి ఉపాధ్యక్షుడు బోలుసాని భీంరెడ్డి,ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు
(ప్రజాగళం,కుల్కచర్ల)
కుల్కచర్ల మండలంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను విడతలవారీగా మంజూరు చేస్తామని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బోలుసాని భీంరెడ్డి,కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని పలు గ్రామాలలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ప్రభుత్వం పేదలకు గృహ సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్,పిరంపల్లి సర్పంచ్ వెంకటయ్య, రాంపూర్ సర్పంచ్ తిరుపతయ్య, గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, మహేష్ కుమార్, లాలు శ్రీనివాస్, తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.