schedule Saturday, May 30, 2026

తేనెటీగల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించిన ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

calendar_today May 20, 2026
person Prajagalam News
తేనెటీగల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించిన ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు
  1. కుల్కచర్ల మండల కేంద్రంలో బోరబండ దగ్గర బుధవారం ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేయడం జరిగింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బొలుసాని భీంరెడ్డి, స్థానిక నాయకులతో కలిసి ,పరామర్శించారు ఈ సందర్భంగా వైద్యుడు డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ ని ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ నాయక్, జోగు వెంకటయ్య గౌడ్,మల్లికార్జున్ తదితరులు ఉన్నారు