schedule Saturday, May 30, 2026

ప్రజల భాగస్వామ్యం తోనే గ్రామాల అభివృద్ధి:- లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్

calendar_today May 21, 2026
person Prajagalam News
ప్రజల భాగస్వామ్యం తోనే గ్రామాల అభివృద్ధి:- లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్
(ప్రజాగళం,కుల్కచర్ల)   ప్రజల భాగస్వామ్యం తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. కుల్కచర్ల మండల పరిధిలోని లాల్ సింగ్ తండా గ్రామపంచాయతీలో ప్రజలకు తడి,పోడి చెత్తను వేరువేరుగా ఉంచి చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించే పంచాయతీ ట్రాక్టర్ సిబ్బందికి అందించేందుకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించాలని,బయట వీధుల్లో చెత్తను పారవేయవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శారద, వార్డు సభ్యురాలు శివమ్మ,మాజీ సర్పంచ్ లక్ష్మీ బాయి,తండా వాసులు శంకర్ నాయక్, లక్ష్మణ్ నాయక్, గోపాల్ నాయక్, సూరారం శ్రీశైలం, దశరథ్ నాయక్,మహిళలు తదితరులు పాల్గొన్నారు