schedule Saturday, May 30, 2026

దేశ ఆధునికీకరణకు, సమాచార సాంకేతిక రంగ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం:- డిసిసి ఉపాధ్యక్షుడు బొలుసని భీంరెడ్డి, ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

calendar_today May 21, 2026
person Prajagalam News
దేశ ఆధునికీకరణకు, సమాచార సాంకేతిక రంగ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం:- డిసిసి ఉపాధ్యక్షుడు బొలుసని భీంరెడ్డి, ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు
(ప్రజాగళం,కుల్కచర్ల) దేశ ఆధునికీకరణకు, సమాచార సాంకేతిక రంగ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బోలుసని భీంరెడ్డి, కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు అన్నారు.మాజీ ప్రధానమంత్రి, భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కుల్కచర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ యువతకు అవకాశాలు కల్పించడంలో, దేశాన్ని ఆధునిక భారతంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి మరువలేనిదని అన్నారు.అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య గౌడ్,పీరంపల్లి సర్పంచ్ వెంకటయ్య, ఇప్పాయిపల్లి సర్పంచ్ పోటీ మల్లేష్ ఘనపూర్ సర్పంచ్ రవీందర్,శంకర్,బాసు నాయక్ సీతారాం నాయక్ బచ్చి రెడ్డి,ఘనపూర్ మాజీ సర్పంచ్ శ్రీను భరత్ రెడ్డి,రాంరెడ్డిపల్లి యాదయ్య,బాల్ రెడ్డి,లాలు నాయక్,వడ్డే వెంకటయ్య ఆయా గ్రామల సర్పంచులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు