ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి దాస్యానాయక్ తండా సర్పంచ్ కవిత రాజు నాయక్
May 22, 2026
Prajagalam News
(ప్రజాగళం,కుల్కచర్ల)
ఉపాధి హామీ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని దాస్యా నాయక్ తండా సర్పంచ్ నేనావత్ కవిత రాజు నాయక్ గ్రామ ప్రజలను కోరారు. శుక్రవారం గ్రామంలోని ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీ కార్యదర్శి అనితతో కలిసి పని ప్రదేశంలో పనులను పరిశీలించారు. అనంతరం కూలీలతో ముచ్చటిస్తూ ఎండ తీవ్రత ఉన్నందున ఉదయం 5 గంటలకు వచ్చి 9 గంటల లోపు ఉపాధి హామీ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లాలని ఉపాధి కూలీలకు తెలియజేశారు. ఉపాధి హామీ కార్డు పోంది ఉన్న వారి సంఖ్య ఎక్కువగా పనికి హాజరు అయ్యో వారి సంఖ్య తక్కువగా ఉందని జాబ్ కార్డులు కలిగి ఉన్న వారందరు ప్రభుత్వం కల్పించిన పని దినాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నూరి తుక్యా నాయక్, వార్డు సభ్యులు జె.దేవుజా,సుశీల,వెంకట్, ఉపాధి హామీ మేటి నరహరి,ఉపాధి హామీ కూలీలు ఉన్నారు.