schedule Saturday, May 30, 2026

జూన్ 20 వరకు టిఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమం

calendar_today May 24, 2026
person Prajagalam News
జూన్ 20 వరకు టిఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమం
  వికారాబాద్-: తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, కల్వకుంట్ల కవిత సారథ్యంలో పాంచజన్యంతో స్థాపించబడిన తెలంగాణ రక్షణ సేన పార్టీ (టిఆర్ఎస్), రాష్ట్రంలోని బాధిత, పీడిత ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ అని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్,వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కుమ్మరి శ్రీనివాస్ లు అన్నారు.ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం సాధన లక్ష్యంగా పార్టీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు. అలాగే ఈ నెల 20వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు “వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ జెండా పండుగ” కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అబ్జర్వర్ కొల శ్రీనివాస్, తాండూర్ నియోజకవర్గ ఇంచార్జి వీరమణి, కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ నాయకులు మనోజ్ కుమార్,సిద్దు, గణేష్, చింటూ, మార్పల్లి నాయకులు చంద్రశేఖర్, జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.