schedule Saturday, May 30, 2026

జాతికి న్యాయం చేయని వ్యక్తి ధారాసింగ్.. కౌన్సిలర్ సురేష్ నాయక్

calendar_today March 20, 2026
person Prajagalam News
జాతికి న్యాయం చేయని వ్యక్తి ధారాసింగ్... కౌన్సిలర్ సురేష్ నాయక్ తాండూర్:మా జాతిలో ఉండి మాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయని వ్యక్తి ధారాసింగ్ అని ఇటీవల జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ చేసిన వ్యాఖ్యలు సభబే అని 13 వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ అన్నారు. కౌన్సిలర్ సురేష్ నాయక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్ పై తీవ్రంగా మండిపడ్డారు. గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ధారాసింగ్ తమ గిరిజనులకు ఎలాంటి న్యాయం చేయలేదనిఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వం అందించే పథకాలను దుర్వినియోగం చేశారని అన్నారు. తన లాభాపేక్ష కోసం పెట్రోల్ బంక్ లను ఏర్పాటుచేసి లాభం పొందుతున్నారని గుర్తు చేశారు. జాతిలో ఉండి ఇప్పటివరకు కూడా ఎస్సీ ఎస్టీ జాతిని ఆదుకున్న దాఖలాలు ఎక్కడ లేవని అన్నారు. ఇటీవల జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ ధారాసింగ్ పై చేసిన వాక్యాలను సమర్థించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు మాజీ కౌన్సిలర్ బీమ్ సింగ్ నాయక్, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.