పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన ఇసుక ట్రాక్టర్ సంఘటనలో ఒకరు రిమాండ్
March 26, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో కోర్వి చెడ్ ఘని గ్రామం సమీపంలో తెల్లవారుజామున ఇసుక ట్రాక్టర్ పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఒకరు రిమాండ్ కు తరలించినట్లు ఎస్.ఐ వి.శ్రీశైలం తెలిపారు.పూర్తి వివరాల్లోకి వెళితే కోర్విచెడ్ ఘని గ్రామ సమీపంలో తెల్లవారుజామున రెండు ఇసుక ట్రాక్టర్లు కనిపించడంతో పోలీస్ వాహనంతో వెంబడించగా ట్రాక్టర్ నడిపిస్తున్న డ్రైవరు వేగంతో వెళ్తూ ఇసుక ఉన్న ట్రాలీనీ వెళుతూ వెళుతూ ఖాళీ చేస్తూ పొలంలోకి దూసుకుపోతూ క్రమంలో పోలీస్ వాహనానికి ఇసుక ట్రాక్టర్ తో గుద్దడంతో పోలీసు వాహనం ముందు భాగం ధ్వంసం కావడం జరిగిందని అందుకు కారణమైన వ్యక్తి మైనర్ కాకావడంతో,ట్రాలీ యజమాని నంద్యా నాయక్ తండా శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్లు తెలిపారు. అదేవిధంగా మరొక్క ట్రాక్టర్ యజమాని డి.సురేష్ పై, డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ పి.శ్రీశైలం తెలిపారు.