schedule Saturday, May 30, 2026

ఆయిల్ ఫామ్ సాగు ...లాభాలు బాగు...

calendar_today March 19, 2026
person Prajagalam News
  • ఆయిల్ ఫామ్ సాగు ...లాభాలు బాగు..
4 రోజుల పాటు రైతు ఉత్సవాలు

రైతు ఉత్సవాలను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ:- సిద్దిపేట ఆయిల్ ఫామ్ సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.ప్రజా పాలనలో భాగంగా నేటి నుండి నాలుగు రోజుల పాటు జరిగే రైతు ఉత్సవాలను సిద్దిపేట జిల్లా నర్మెట్ట మండలం నంగునూరు ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ వద్ద తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ లు ప్రారంభించారు.అనంతరం జరిగిన బహిరంగ సభలో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ...తెలంగాణ రావాలని దృఢమైన సంకల్పంతో పోరాడిన స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్, గడ్డం వెంకటస్వామి కన్న కలలు ఎలాగైతే ఈనాడు నిజమయ్యాయో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫాం పంట సాగు పెంచడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కష్టపడుతున్నారన్నారు. ఆయిల్ ఫాం సాగుతో రైతులకు నికరంగా లాభాలు రావడంతో కుటుంబాలు బాగుపడుతాయి. మా వికారాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు వేల ఎకరాలలో ఆయిల్ ఫాం సాగు చేస్తున్నారని గుర్తు చేశారు.ఇంకా పెద్ద ఎత్తున సాగు చేయించడానికి రైతులను ప్రోత్సహిస్తున్నాను. నాటిన మొదటి నాలుగు సంవత్సరాలు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తున్నదని తెలిపారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా రైతుకు కొంత సహాయం అందే విదంగా చూస్తానని హామీ ఇచ్చారు. మన దేశం ఏడాదికి లక్ష కోట్ల రూపాయల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నదని, కాబట్టి ఆయిల్ ఫాం పంటను ఎంత పెద్ద మొత్తంలో సాగు చేసినా మార్కెటింగ్ కు ఇబ్బంది లేదని చెప్పారు. రైతులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఆయిల్ ఫాం సాగు చేయాలి. ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు అందే విదంగా సహకరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ రెడ్డి, MP రఘునందన్ రావు, ఆయిల్ పైడ్ రాష్ట్ర చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, విత్తనభివృద్ధి రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్, ఉన్నతాధికారులు, భారీ ఎత్తున్న రైతులు పాల్గొన్నారు.‎