schedule Saturday, May 30, 2026

రైతుల సందేహాలకు శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మండల వ్యవసాయ అధికారి అనిత

calendar_today April 28, 2026
person Prajagalam News
రైతుల సందేహాలకు శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మండల వ్యవసాయ అధికారి అనిత
  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో కాశీంపూర్ గ్రామ రైతు వేదికలో నేడు ఉదయం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి అనిత ఓ ప్రకటనలు తెలిపారు.ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ నేడు నిర్వహించే కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్ర వేత్తల ద్వారా,రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు పంట సాగులో మెళకువలు,నూతన సాంకేతిక పద్ధతులు,వంగడాలపై అవగాహన,ఎరువుల వినియోగం యాజమాన్యం,చీడపీడలపై అవగాహన,నివారణ పద్ధతులు,అంతరపంటల సాగు,పంట మార్పిడి మొదలగు విషయాలపై రైతులకి అవగాహన శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.