schedule Saturday, May 30, 2026

పది ఫలితాలలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలు

calendar_today April 30, 2026
person Prajagalam News
పది ఫలితాలలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలు
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో పి ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత (బాలికల) పాఠశాల లో పది పరీక్షలు ఉత్తీర్ణతలో బాలికలు సత్తా చాటారు.ఈ సందర్భంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హిర్యా నాయక్ మాట్లాడుతూ పాఠశాల ఉత్తీర్ణత 92 శాతం రావడం గణనీయమని, ప్రభుత్వ పాఠశాలలో అనుభవంతులైన ఉపాధ్యాయుల చేత విద్యార్థులకు పాఠాలు బోధించడం విద్యార్థులు శ్రద్ధతో చదవడంతో, పాఠశాలకు,తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం చాలా సంతోషమని అన్నారు.పాఠశాల ఇంగ్లీష్ మీడియం మొదటి స్థానంలో పెద్ద గొల్ల దీపిక 536,రెండోవ స్థానం సులేగం అమూల్య 531,మూడవ స్థానం లో వనరాశి భవాని 528, అదేవిధంగా తెలుగు మీడియంలో మొదటి స్థానంలో మాల స్వర్ణలత 541,రెండోవ స్థానం దోరే పల్లి మధు శ్రీ 530,మూడవ స్థానం లో రాథోడ్ అనిత భాయి 508 మార్కులు సాధించిన వారికి పాఠశాల తరపున ప్రధానోపాధ్యాయులు హిర్యా నాయక్,పాఠశాల ఉపాధ్యాయుల బృందం విద్యార్థినిలను అభినందించారు.