schedule Saturday, May 30, 2026

విద్యార్థి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఉపాధ్యాయులు

calendar_today April 30, 2026
person Prajagalam News
విద్యార్థి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఉపాధ్యాయులు
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామానికి చెందిన శివకుమార్ అనే విద్యార్థి ఈత కోసం వెళ్లి బావిలో చనిపోవడంతో ఆ విద్యార్థి కుటుంబాన్ని దిర్సంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం పరామర్శించారు.ఈ సందర్భంగా ఆ కుటుంబానికి భరోసా కల్పించారు.అనంతరం ఆ కుటుంబానికి
 10,500/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి వెంకట్రాములు , ప్రాథమిక పాఠశాల ఏఎంసీ చైర్మన్ పద్మమ్మ , మాజీ చైర్మన్ గిరిజ , ప్రధానోపాధ్యాయులు కేశవులు , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.