schedule Saturday, May 30, 2026

విద్యార్థుల ఖాతాల్లోనే ఫీజులు జమ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం 

calendar_today May 1, 2026
person Prajagalam News
విద్యార్థుల ఖాతాల్లోనే ఫీజులు జమ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం 
   

• విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యానికి రెండింటికీ మేలు...బిసి జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్

(తాండూర్) రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని బిసి జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు.ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులకు నేరుగా లబ్ధి చేరడమే కాకుండా, కాలేజీ యాజమాన్యాలకు కూడా సకాలంలో ఫీజులు అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు మధ్యవర్తిత్వం, ఆలస్యం వంటి సమస్యలు ఉండేవని, ఈ కొత్త విధానం వల్ల అవి గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు.విద్యార్థులు తమ ఫీజులను స్వయంగా చెల్లించే విధానం ద్వారా బాధ్యత పెరుగుతుందని, అదే సమయంలో కాలేజీలకు కూడా ఆర్థిక ప్రవాహం సక్రమంగా జరుగుతుందని అన్నారు. దీంతో విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బకాయిలు క్లియర్ చేస్తే, కాలేజీలు ఆర్థికంగా బలపడటమే కాకుండా, విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందించగలవని తెలిపారు.ఈ నిర్ణయం పారదర్శకతకు నిదర్శనమని, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలను స్వాగతిస్తున్నామని తెలిపారు.