అధిక రసాయనాలు వద్దు,జీవన ఎరువులు వాడండి వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు
May 1, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో నావల్గా గ్రామంలో రైతు వేదిక లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన స్థానం, ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంలో వ్యవసాయ పరిశోధనా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.పరిమళ,సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వై.భారతి, మండల వ్యవసాయ అధికారి ఎన్.అనిత మాట్లాడుతూ రైతులు అధికంగా యూరియా వాడకూడదు, యూరియా వల్ల నేల ఆరోగ్యం దెబ్బతిని దీర్ఘకాలిక ఉత్పాదకత తగ్గుతుందని, మార్కెట్లో గిరాకి ఉన్న వరి రకాలు సాగు చేసి అధిక ఆదాయం పొందాలి,అధిక రసాయనాల వాడకం వలన వానపాములు,మిత్ర పురుగులు నశిస్తున్నాయని, పంట మార్పిడి తప్పని సరిగా చేసుకోవాలని,సేంద్రియ వ్యవసాయంలో భాగంగా మక్కిన పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, జీవన సాగునీటిని ఆదా అధచేయాలని,స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ వంటి బిందు సేద్య పద్ధతులను అవలంబించలన్ని, పంటలను కాపాడటానికి వేపనూనె స్ప్రే,రసం పిల్చు పురుగులకు జిగురు అట్టలు అమర్చడం ఇలాంటి పద్ధతులను పాటించాలని,రైతు రిజిస్ట్రేషన్ తప్పని సరిగా చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో యంగ్ ప్రొఫెషనల్స్ సల్మాన్,కేశవ, కృష్ణ,వ్యవసాయ విస్తరణ అధికారులు సౌమ్య ,సామ్యేల్ ,వసీం,ప్రవీణ్,విజయ్,నవీన్, తదితరులు పాల్గొన్నారు.