క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపోందిస్తాయి. ....మాజీ ఎంపీటీసీ రాఘవపురం రాములు
May 3, 2026
Prajagalam News
యువత క్రీడలు ఆడడం వలన శారీరక దృఢత్వాన్ని పెంపోందిస్తాయని మాజీ ఎంపీటీసీ రాఘవపురం రాములు అన్నారు. ఆదివారం దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ చివరి రోజు కావడంతో బీపీఎల్ రైజర్స్, టైగర్స్ టీంలు తలపడ్డాయి. రైజర్స్ టీం విన్నర్గా గెలుపొందగా, మొదటి బహుమతి రూ.10 వేలు మోమోంటోను అందుకున్నాయి. టైగర్స్ రన్నర్ గా రెండవ బహుమతి రూ.6 వేలు మోమోంటోను గెలుపొందాయి. దాంతో పాటు టోర్నమెంట్ మొత్తంలో ఎంవీపీ(అత్యాధిక స్కోర్) ప్లేయర్ ఎం. విజయవర్ధన్ ముందంజలో ఉండగా.. గ్రామానికి చెందిన మోహిన్ అఖిల్ సైకిల్ను బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి యువకుడు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొని ముందుకు సాగేందుకు కృషి చేయాలన్నారు. క్రీడలు శారీరక మానసిక దృఢత్వానికి ఎంతో దోహదపడుతాయని,స్నేహా పూర్వకంగా ఆడుకునేందుకు శ్రద్ధ చూపాలన్నారు. ఆనంతరం మాజీ ఎంపీటీసిని క్రీడాకారులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మెసిన్ పాష, గ్రామ వార్డు సభ్యులు కొనగాళ్ల నర్సింహులు, ముద్దం ప్రవీణ్ యాదవ్, బెస్త నర్సింహులు, కుర్వ రమేశ్. రాజేష్ యాదవ్,ముద్దం నర్సింహులు, మడుగు వెంకటయ్య, రాషాత్ పాష, కోళ్ల రమేశ్, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు బొంపల్లి వెంకటేశ్, మాజీ వార్డు సభ్యులు బోయిని చంద్రశేఖర్, కోళ్ల నర్సిములు, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.