ముగిసిన జనాభా గణన శిక్షణ కార్యక్రమం
May 5, 2026
Prajagalam News
(తాండూర్)
తాండూర్ మున్సిపాలిటీలో జనాభా గణన శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి జిల్లా సెన్సెస్ అదనపు అధికారి రవీందర్ రావు,జిల్లా టెక్నికల్ ఆఫీసర్ జంగయ్య , మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి , కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, మాస్టర్ ట్రెనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు సెన్సెస్ అధికారి రవీందర్ రావు మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్నటువంటి అంశాలన్నింటినీ ఫీల్డ్ లో ఉపయోగించుకోవాలని సూచించారు. ఈసారి జనాభా గణన డిజిటల్ పద్ధతిన చేయడం జరుగుతుందని, ఇచ్చినటువంటి యాప్ ద్వారా తప్పులు లేకుండా జాగ్రత్తగా చేయాలని చెప్పారు. మ్యాపుల ద్వారా ఏరియాను ఏనుమారిటర్స్ గుర్తించి తమ కేటాయించిన ఏరియాలో చేయాలని చెప్పారు. మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని తాండూర్ ని ముందంజలో ఉండేలా చూడాలని కోరారు. భవిష్యత్తులో అభివృద్ధికి జనాభాగణన ఎంత ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎనమా రైటర్లకు, సూపర్వైజర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను అందజేయడం జరిగింది.