ప్రవేట్ సంస్థకు డబుల్ ఇండ్లు కేటాయించడం అప్రజాస్వామికం
May 5, 2026
Prajagalam News
(తాండూర్)
డబుల్ ఇండ్లను ప్రవేట్ సంస్థకు కేటాయించడం ప్రజాస్వామికమని బిజెపి నాయకులు అన్నారు. తాండూరు పట్టణ పేద ప్రజలకు అన్యాయం చేయాలని చూశారో అట్టి సంస్థ వ్యక్తులపై డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయమై తాండూరు బిజెపి నాయకులు వికారాబాద్ కలెక్టర్ ని కలిసి వినతి పత్రాన్ని అందించారు.తాండూరు పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఒక ప్రైవేట్ సంస్థకు ప్రత్యేకంగా ఒక్క మైనార్టీ వర్గానికి ఇవ్వడం చట్ట రిత్యా నేరం అప్రజాస్వామీకం అని పేర్కొన్నారు. ఈ ఘటనపై పట్టణ ప్రజలందరూ అయోమయానికి గురయ్యారని కాబట్టి వెంటనే ఇచ్చినటువంటి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వెనక్కి తీసుకొని ఆ సంస్థపై వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాహూ శ్రీలత, జిల్లా దిశా నెంబర్ అంతారం లలిత, తాండూరు బిజెపి పట్టణ అధ్యక్షులు ఫ్లోర్ లీడర్ 28వ వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, 33వ వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి,జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బండారు శ్రీకాంత్ పట్టణ ఉపాధ్యక్షుడు దోమ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.